AP SSC Hall Tickets 2024 : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల హాల్ టికెట్లను సోమవారం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఆదివారం తెలిపారు.. విద్యాశాఖ అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
2023–24 విద్యా సంవత్సరానికి గాను 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. గతేడాది పదో తరగతి తప్పి మళ్లీ పరీక్ష రాస్తున్నవారు 1,02,528 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను కేటాయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..