AP SSC 2024 Reverification Results: ఏపీ ‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల.. నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

|

May 24, 2024 | 7:49 AM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్కూల్స్‌ లాగిన్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. మే 30 వరకు వెబ్‌సైట్లో ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి అవకాశం..

AP SSC 2024 Reverification Results: ఏపీ పది రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల.. నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
AP SSC 2024 Reverification Results
Follow us on

అమరావతి, మే 24: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి వార్షిక పరీక్షల 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్కూల్స్‌ లాగిన్‌ ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. మే 30 వరకు వెబ్‌సైట్లో ఫలితాలు చెక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా ఈ సారి ఏపీలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55,966 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి 2024 రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నేటి నుంచి ఏపీ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. ఫెయిలైన విద్యార్థులందరికీ పరీక్ష రాసేందుకు అవకాశం

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి పరీక్ష ఫీజు చెల్లించకపోయినా విద్యార్థులు పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. ఈ మేరకు విద్యార్ధులందరికీ హాల్‌టికెట్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్ధులందరూ హాల్‌టికెట్లు తీసుకుని, పరీక్షలకు హాజరు కావొచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.61 లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్‌ కాగా వారిలో 1.15 లక్షల మంది పరీక్ష ఫీజు కట్టారు. కాగా ఈ రోజు నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలతోపాటు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 3 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్ధులను ఉదయం 8.45 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఇక ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సెకండ్‌ ఇయర్‌కు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులందరూ తమతోపాటు తప్పనిసరిగా హాల్‌ టికెట్లు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.