అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు మరి కొద్ది నిమిషాల్లో తెర పడనుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) సోమవారం (ఏప్రిల్ 2024) విడుదల కానున్నాయి. విజయవాడలో ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో ఔ మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవగా.. 1.02 లక్షల మంది విద్యార్ధులు ప్రైవేటుగా పరీక్షలు రాశారు. ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. ఎప్పుడూ మే నెలలో విడుదల చేసే టెన్త్ ఫలితాలు ఈ సారి కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.
మే 24 నుంచి జూన్ 3 వరకు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. రేపట్నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
రాష్ట్రంలోని 12 రకాల మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా..
పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏపీ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
ఈ రోజు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో సబ్జెక్ట్ వారీగా ఉత్తీర్ణత శాతం చూస్తే..
పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే 4.85 శాతం బాలికలు అధికంగా ఉత్తీర్ణత పొంది పైచేయి సాధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.
ఈ రోజు విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 98.43 శాతంతో అధికంగా ఉత్తీర్ణత సాధించాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37 శాతంతో అత్యంధిక శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.
పరీక్షలకు హాజరైన మొత్తం 6.16.615 మందిలో 86.69 శాతం ఉత్తీర్ణత అంటే 5.34.574 మంది ఉత్తీర్ణత పొందారు. 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ ఎస్సెస్సీ డైరెక్టర్ దేవానంద రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు.
మొత్తం 6.16 వేల రెగ్యులర్ విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది ఒక్క విద్యార్ధి కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదు. 8 రోజుల్లో వాల్యుయేషన్ కంప్లీట్ చేశాం. టెన్త్ పరీక్షల చరిత్రలోనే లాస్ట్ వర్కింగ్ డేకు ముందుగానే తొలిసారి ఈ ఏడాది ఫలితాలు విడుదల చేస్తున్నాం అని అధికారులు అన్నారు.
మరికాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నాయి.
గతేడాది ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తికాగా.. ఈ ఏడాది మార్చి 30వ తేదీతో పరీక్షలు కంప్లీట్ అయ్యాయి. ఇక 2023లో మే6వ తేదీన టెన్త్ రిజల్ట్స్ వెలువడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు కూడా చాలా ముందుగా వెలువడుతున్నాయి.
మార్చి 30న పదో తరగతి పరీక్షలు పూర్తికాగా.. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 8 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా దాదాపు 25 వేల మంది సిబ్బంది మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు.
గతేడాది (2023) ఏపీ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,03,700 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాదితో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇక గతేడాది పదో తరగతి ఫలితాల్లో.. 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ పదో తరగతి ఫలితాలు తొలుత 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ కాస్త ఆలస్యంగా రానున్నాయి. ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన సమయం కంటే అరగంట ఆలస్యంగా రానున్నాయి.
మరికొద్ది నిమిషాల్లో ప్రకటించనున్న పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. విద్యార్ధుల కెరీర్‌కు పదో తరగతి మార్కులే కీలకం. దీంతో ఫలితాల కోసం వారంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఫలితాల ప్రకటనకు ముందే పలు ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు షురూ చేశాయి.