AP 10th Class Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇక్కడ నేరుగా ఒక్క క్లిక్‌తో చెక్‌ చేసుకోండి

|

Apr 22, 2024 | 11:29 AM

AP SSC Results 2024: పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌. ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు సోమవారం (ఏప్రిల్‌ 2024) విడుదల అయ్యాయి. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,02,528 మంది గతంలో..

AP 10th Class Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇక్కడ నేరుగా ఒక్క క్లిక్‌తో చెక్‌ చేసుకోండి
AP SSC Results
Follow us on

అమరావతి, ఏప్రిల్ 22: పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌. ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు సోమవారం (ఏప్రిల్‌ 2024) విడుదల అయ్యాయి. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు కూడా ఉన్నారు. తాజా ఫలితాల్లో 86.69 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతంతో బాలికలు సత్తా చాటారు. విద్యార్ధులు తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ నమోదు చేసి పదో తరగతి పరీక్షల ఫలితాలను టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో నేరుగా చెక్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఇవి కూడా చదవండి

కాగా రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈసారి పరీక్షలు జరిగిన 22 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించడం విశేషం.

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.