
Job Mela In AP: ఇటీవల వరుసగా జాబ్‌మేళాలను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC), తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహిస్తోంది. డిసెంబర్ 27 (నేడు) ఈ జాబ్‌మేళ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభంకానున్నాయి. నోటిఫికేషన్‌లో భాగంగా వరుణ్ మోటార్స్, మీషో, క్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్, డీమార్ట్ కంపెనీల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూకు ఎలా హాజరుకావాలి.? ఎక్కడ జరగనుంది.? లాంటి పూర్తి వివరాలు..
* వరుణ్ మోటార్స్‌లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా(మెకానికల్&ఆటోమొబైల్), బీటెక్(మెకానికల్), ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 8500 నుంచి రూ. 12వేల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉండాలి.
* ప్రముఖ ఆన్‌లైన్ బిజినెస్ మీషోలో సేల్స్ అసోసియేట్స్/ఆఫీసర్స్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 22వేలతో పాటు ఇన్సెంటీవ్‌లు అందిస్తారు.
* డీమార్ట్ సంస్థలో క్యాషియర్, సేల్స్ అసోసియేట్, గోడౌన్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే వారు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,900 నుంచి రూ. 11,500 వరకు చెల్లిస్తారు. అభ్యర్థులు విజయవాడ, గుంటూరు, ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది.
* క్యూస్ కార్పొరేషన్ లిమిటెడ్ (Quess Corp Limited) పోస్టులకు భర్తీ చేసుకునే వారు ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు చెల్లిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా రిజిస్టార్ కావాలి.
* ఆ తర్వాత రెజ్యుమే, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
* ఇంటర్వ్యూను ఎమ్‌ఆర్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, నందిగామ నుంచి మధిర రోడ్, నందిగామా-సీఆర్‌డీఏ రీజియన్‌లో ఇంటర్వ్యూను నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం 9014943757, 9988853335 నంబర్లను సంప్రదించవచ్చు.
@AP_Skill has Conducting Skill Connect Drive at MRR College of Pharmacy #Nadigama #CRDARegion
Registration Link: https://t.co/MHLubyk11n@Meesho_Official @Quess_Corp@varunmotors #DMart pic.twitter.com/zEXGjkERpw— AP Skill Development (@AP_Skill) December 24, 2021
Also Read: Crime News: కట్నం ఇవ్వలేదని 45 రోజులుగా బందీ.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ అత్తింటి కుటుంబసభ్యులు
Kurnool District: ఆ ఊరికి ఉరుకులు పరుగులు పెట్టిన జిల్లా యంత్రాంగం.. తీరా వెళ్లి చూడగా షాక్