Polycet 2026 Toppers List: పాలీసెట్‌లో 16 మంది విద్యార్ధులకు 120కి 120 మార్కులు.. టాప్‌లేపిన గోదారోళ్లు

రాష్ట్ర పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం విద్యార్ధుల్లో ఏకంగా 91.37 శాతం మంది ఇందులో అర్హత సాధించారు. ముందెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పాలీసెట్‌లో అత్యధికంగా 1,77,581 మంది నమోదు చేసుకున్నారు. ఇందులో 1,63,008 మంది ప్రవేశ పరీక్షకు రాయగా.. 1,48,950 మంది అర్హత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత 95.36 శాతం ఉత్తీర్ణత పొందగా.. ఈ ఏడాది 3.99 శాతం తగ్గినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరిగడం విశేషం..

Polycet 2026 Toppers List: పాలీసెట్‌లో 16 మంది విద్యార్ధులకు 120కి 120 మార్కులు.. టాప్‌లేపిన గోదారోళ్లు
AP Polycet Toppers List

Updated on: May 07, 2026 | 2:57 PM

అమరావతి, మే 7: ఈ ఏడాది పాలీసెట్ మొత్తం ఫలితాల్లో అత్యధికంగా బాలికలు 93.57 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిలు 89.88 కనీస అర్హత మార్కులు పొందారు. అయితే పాలీసెట్‌లో 16 మంది విద్యార్ధులకు 120కి 120 మార్కులకు వచ్చాయి. మార్కులు సమానంగా వచ్చిన వీరిందరికీ పుట్టినతేదీ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. వీరిలో తొమ్మిది మంది పశ్చిమగోదారి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. విశాఖపట్నం నుంచి ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కాకినాడ, తిరుపతి జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

టాప్‌ ర్యాంకర్లు వీరే

  • దోమాడ రాంగౌతమ్‌ (తూర్పుగోదావరి)
  • తమరల సాయి వైష్ణుతేజ (పశ్చిమ గోదావరి)
  • జమి చేతన్‌ (విశాఖపట్నం)
  • తోట మానస (పశ్చిమ గోదావరి)
  • పిండి జగన్‌ వెంకట నరసింహస్వామి (పశ్చిమ గోదావరి)
  • ఆర్‌ రోహిత్‌ (పశ్చిమ గోదావరి)
  • KSSVK చైతన్య (పశ్చిమ గోదావరి)
  • డీ నాగసత్య హిమ సూర్య (తూర్పు గోదావరి)
  • ఎస్ హేమ చంద్ర (విశాఖపట్నం)
  • వెల్దుర్తి మోక్షిత్‌ (తిరుపతి)
  • తోలేటి బెర్నిస్‌ దివ్య (పశ్చిమ గోదావరి)
  • గోర్లె బాలాదిత్య (విశాఖటప్నం)
  • పూడి చైతన్య (కాకినాడ)
  • రెడ్డి వరుణ్‌ కుమార్‌ (పశ్చిమ గోదావరి)
  • BVV యశ్వంత్‌ (పశ్చిమ గోదావరి)
  • సంగినిడి జైరామ్‌ (పశ్చిమ గోదావరి)

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 265 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 84 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. పాలీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లను కేటాయిస్తామని ఉన్నతవిద్య కమిషనర్‌ భరత్‌గుప్తా తెలిపారు. పాలిసెట్‌ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 99.11 శాతంతో మొదటిస్థానంలో నిలవగా.. శ్రీసత్యసాయి జిల్లా 87.85 శాతం ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us