AP PGCET 2024: ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

|

Apr 03, 2024 | 2:58 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్‌ తదితర)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించనున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (ఏపీ పీజీసెట్) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో..

AP PGCET 2024: ఏపీ పీజీసెట్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
AP PGCET 2024
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో దాదాపు 145 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్‌ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్‌ తదితర)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించనున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌-2024 (ఏపీ పీజీసెట్) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరుగుతుంది. ఏపీ పీజీసెట్ 2024లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 1 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీలకు చెందిన వారు రూ.850, బీసీలు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.650 అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. ఏపీ పీజీసెట్ 2024 ప్రవేశ పరీక్ష జూన్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేవ పరీక్ష ఆన్‌లైన్‌ (సీబీటీ) విధానంలో ఉంటుంది. మొత్తం 3 కేటగిరీలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. కేటగిరీ-1 పరీక్షలో ఆర్ట్స్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సులు ఉంటాయి. కేటగిరీ-2 పరీక్షలో కామర్స్ అండ్‌ ఎడ్యుకేషన్ కోర్సు ఉంటుంది. కేటగిరీ-3 పరీక్షలో సైన్స్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహిస్తారు.

ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే..

  • ఆంధ్ర యూనివర్సిటీ – విశాఖపట్నం
  • డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ – శ్రీకాకుళం
  • శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ – తిరుపతి
  • డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ – కర్నూలు
  • శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ – అనంతపురం
  • ద్రవిడియన్ యూనివర్సిటీ – కుప్పం
  • ఆచార్య నాగార్జన యూనివర్సిటీ – గుంటూరు
  • కృష్ణా యూనివర్సిటీ – మచిలీపట్నం
  • శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం – తిరుపతి
  • ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ – రాజమహేంద్రవరం
  • యోగి వేమన యూనివర్సిటీ – కడప
  • క్లస్టర్ యూనివర్సిటీ – కర్నూలు
  • రాయలసీమ యూనివర్సిటీ – కర్నూలు
  • ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ – ఒంగోలు
  • విక్రమ సింహపురి యూనివర్సిటీ – నెల్లూరు
  • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
  • శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – తిరుపతి

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 1, 2024.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 4, 2024.
  • రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 15, 2024.
  • రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మే 25, 2024.
  • ప్రవేశ పరీక్షల ప్రారంభ తేదీ: జూన్‌ 10, 2024 నుంచి

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.