AP Model Schools TGT and PGT Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 282 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులు 71, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) పోస్టులు 211 వరకు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంగ్లిష్/సివిక్స్/కామర్స్/ఎకనామిక్స్/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బోటనీ/ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అలాగే దరఖాస్తుదారుల వయసు 44 ఏళ్లకు మించరాదు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 17, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులను జోన్లవారీగా అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. యూజీ, పీజీ డిగ్రీలో సాధించిన మార్కులకు60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేసిన అనుభవం ఉంటేవారికి 20శాతం, టీచింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీచింగ్ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
జోన్ల వారీగా ఖాళీలు ఇలా..
టీజీటీ పోస్టులు:
పీజీటీ పోస్టులు:
ముఖ్యమైన తేదీలు..
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.