ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్)- 2022, పోస్టు గ్రాడ్యుయేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022లకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. లాసెట్‌కు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో డిసెంబర్ 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. విద్యార్ధుల హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఐతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏపీ లాసెట్-2022/పీజీలాసెట్-2022 ర్యాంక్ కార్డు, మార్క్ షీట్, హాల్‌టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఐడీకార్డు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్.. ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయవల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్ కేటగిరి విద్యార్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి విద్యార్ధులు రూ.500లు చెల్లించాలి. డిసెంబర్ 19న సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు విడుదలవుతాయి. డిసెంబర్ 23లోపు సీట్లు పొందిన వారు ఆయా లా కాలేజీల్లో రిపోర్టు చేయవల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.