AP LAWCET 2022 applicaiton last date: ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2022కు దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి ప్రారంభమయ్యింది. లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ లా సెట్-22 కన్వీనర్, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ న్యాయ విభాగాధిపతి ఆచార్య సీతాకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు జూన్ 13వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష జులై 13న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందన్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్ 20, రూ.1000లతో జూన్ 27, రూ.2000లతో జులై 7వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
ఇక మే 9 న ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 7 వరకు కొనసాగుతుంది. అపరాధ రుసుము రూ.వెయ్యితో జూన్ 15, రూ.2000లతో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్‌కు మే 3 నుంచి జూన్ 3 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్ 13, రూ.2000లతో 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు పీజీఈసెట్, ఐసెట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: