AP KGBV Inter 2022: ఏపీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ 2022 ప్రవేశాలకు నోటిఫికేషన్‌

|

Jun 27, 2022 | 5:08 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు జులై 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్‌..

AP KGBV Inter 2022: ఏపీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ 2022 ప్రవేశాలకు నోటిఫికేషన్‌
Ap Kgbv
Follow us on

AP KGBV Inter 1st year Admissions 2022-23: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు జులై 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 352 కేజీబీవీ స్కూళ్లన్నింటిలోనూ ఇంటర్మీడియట్‌ను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అనాథల విద్యార్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, పేద కుటుంబాలకు చెందిన బాలికలందరూ దరఖాస్తు చేసుకోవాడానికి అర్హులని వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://apkgbv.apcfss.in/ లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా డైరెక్టర్‌ వెట్రిసెల్వి వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 29, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 12, 2022.
  • సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల తేదీ: జులై 13, 14 తేదీల్లో విద్యార్ధుల ఫోన్లకు మేసేజ్‌లను పంపిస్తారు.
  • మొదటి రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు విడుదల, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌: జులై 15 నుంచి 20 వరకు
  • రెండో రౌండ్‌ సెలక్షన్‌ లిస్టు విడుదల, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌: జులై 21 నుంచి 22 వరకు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.