AP Inter 1st year, 2nd year Results 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. విజయవాడలో ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఈ పరీక్షలకు రెండు ఏడాదులకు గాను మొత్తం 9 లక్షల మంది హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 2,41,599 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌లో 2,58,449 మంది పాస్ అయ్యారు. పర్సంటేజ్ విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో 54 శాతం, సెకండ్ ఇయర్‌లో 61 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫస్ట్ ఇయర్‌లో బాలురు 49 శాతం పాస్‌కాగా, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌లో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల పరంగా చూస్తే 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్ల మొదటి స్థానంలో ఉండగా, 50 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే రెండో స్థానంలో 68 శాతంతో గుంటూరు నిలవగా తర్వాతి స్థానాల్లో వరుసగా.. నెల్లూరు (67 శాతం), విశాఖపట్నం (65), వెస్ట్ గోదావరి (64), ప్రకాశం (59), చిత్తూరు (58), ఈస్ట్ గోదావరి (58), శ్రీకాకుళం (57), కర్నూలు (55), అనంతపురం (55), విజయనగరం (50), కడప (50) ఉత్తీర్ణత సాధించారు. బాలురుల్లో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా 66 శాతంతో కృష్ణ, అమ్మాయిల విషయంలో 72 శాతంతో కృష్ణ జిల్లా నిలిచింది. ఇక అత్యల్ప ఉత్తీర్ణతగా బాలురు 34 శాతం, బాలికలు 47 శాతం కడపలో నమోదైంది.
ముఖ్యమైన విషయాలు..
* విద్యార్థులకు ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
* ఫెయిల్ అయిన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో హాజరు కావొచ్చు.
ఫలితాలు ఇక్కడ చూసుకోండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..