AP ECET and ICET 2024 Results: రేపే ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. త్వరలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఐసెట్‌, ఈసెట్‌ 2024 పరీక్షలను ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలను గురువారం (మే 30న) విడుదల చేయనున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన..

AP ECET and ICET 2024 Results: రేపే ఏపీ ఐసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల.. త్వరలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వెల్లడి
AP ECET and ICET 2024 Results

Edited By: Shaik Madar Saheb

Updated on: May 30, 2024 | 11:29 AM

అమరావతి, మే 29: ఆంధ్రప్రదేశ్‌లో ఐసెట్‌, ఈసెట్‌ 2024 పరీక్షలను ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈసెట్‌ 2024 ఫలితాలను గురువారం (మే 30న) విడుదల చేయనున్నట్లు ఈసెట్‌ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు కూడా మే 30వ తేదీనే విడుదకానున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ మురళీకృష్ణ తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 48,828 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 44,446 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల ప్రకటన అనంతరం త్వరలో కౌన్సెలింగ్‌ తేదీలను కూడా ప్రకటించనున్నారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏపీఆర్‌జేసీ 2024 ఫేజ్‌-2 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్‌జేసీ 2024 ప్రవేశ పరీక్ష ఫేజ్‌-2 ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 25న ఏపీఆర్‌జేసీ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొదటి విడత ఫలితాలు మే 14న విడుదల చేశారు. అనంతరం విద్యార్ధులు పొందిన మార్కులు, రిజర్వేషన్‌, స్పెషల్‌కేటగిరీ, స్థానికత తదితరాల ఆధారంగా ఆయా గురుకుల విద్యాలయాల్లో సీట్లు కేటాయించారు. తాజాగా సెకండ్‌ ఫేస్‌ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ క్యాండిడేట్‌ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేసి ఫలితాలను పొందవచ్చు.

కాగా ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

ఏపీఆర్‌జేసీ 2024 ఫేజ్‌-2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.