AP High court Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. హైకోర్టులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Oct 23, 2022 | 4:35 PM

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు దీపావళికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా అమరావతిలోని హైకోర్టులో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

AP High court Jobs: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. హైకోర్టులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Ap High Court Jobs
Follow us on

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు దీపావళికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా అమరావతిలోని హైకోర్టులో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 135 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడో తరగతి పరీక్ష ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను : కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 నుంచి రూ. 61,960 వరకు చెల్లిస్తారు.

* ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 29-10-2022న ప్రారంభమవుతుండగా, చివరి తేదీని 15-11-2022గా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..