AP DME Jobs: విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* మొత్తం 326 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గాను డైరెక్ట్ (188), లేటరల్ ఎంట్రీ (138) ఖాళీలు ఉన్నాయి.
* ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపి పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎన్‌బీ /ఎంబీబీఎస్‌తోపాటు ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఐ/ఎన్‌ఎంసీ/డీసీఐలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. క్లినికల్ స్పెషలైజేషన్స్‌కి సీనియర్ రెసిడెన్సీ తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 23.11.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థలను పీజీ డిగ్రీ/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 92,000 చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 09.12.2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: India GDP: గాడిలో పడ్డ దేశ ఆర్థిక వృద్ధి.. రెండవ త్రైమాసికంలో 8.4% GDP వృద్ధి రేటు నమోదు..!
SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..
SRH IPL 2022 Retained Players: ఎస్ఆర్‌హెచ్ సంచలన నిర్ణయం.. వార్నర్, భువీ, రషీద్ ఖాన్ రిలీజ్..