APEPCET 2021: విద్యార్థులకు అలెర్ట్.. 25 నుంచి ఏపీఈపీసెట్ కౌన్సెలింగ్.. సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

APEPCET 2021 counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఈపీసెట్ 2021 ఫలితాలను గత నెల విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ కోర్సులకు

APEPCET 2021: విద్యార్థులకు అలెర్ట్.. 25 నుంచి ఏపీఈపీసెట్ కౌన్సెలింగ్.. సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?
Apepcet 2021 Counselling

Updated on: Oct 21, 2021 | 4:31 PM

APEPCET 2021 counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఈపీసెట్ 2021 ఫలితాలను గత నెల విడుదలైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇంజనీరింగ్‌తోపాటు ఫార్మసీ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్‌ను ఈ నెల 25 నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేష్  ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఇంజినీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇలా..

ఈ నెల 25 నుంచి 30 వరకూ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్లు.

ఈ నెల 26 నుంచి 31 వరకూ సర్టిఫికెట్ల వేరిఫికేషన్.

వచ్చే నెల 1 నుంచి 5 వరకూ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం.

నవంబర్ 6న ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం.

వచ్చే నెల 10న సీట్ల కేటాయింపు.

వచ్చే నెల 15 నుంచి తరగతుల ప్రారంభం.

దీనికి సంబంధించి ఈ నెల 25 న ఏపీఈపీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  నవంబర్ 1 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతాయన్నారు. నవంబర్ 10 న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 15 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ ఏడాది నుంచి 4 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 2,330 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని సురేష్ తెలిపారు.  మొదటి విడత కౌన్సిలింగ్ లో కన్వీనర్ కోటలో ఇంజనీరింగ్ కు 77 వేల 357 సీట్లు, బీ ఫార్మసీలో  3 వేల 615 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ర్యాంకుల ప్రకారం రాష్ట్రంలోని కళాశాలల్లో సీట్లను కేటాయించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్  అనంతరం కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. అనంతరం వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. ఆ తర్వాత  ర్యాంకుల ప్రకారం సీట్ల కేటాయింపు జరగుతుందని అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్.. ఏపీఈపీసెట్(APEPCET 2021) ను కాకినాడ జేఎన్‌టీయూ నిర్వహించింది. పరీక్షల అనంతరం ఇంజనీరింగ్, ఫార్మసికి సంబంధించిన ఫలితాలను విడివిడిగా విడుదల చేశారు.

Also Read:

AP PGECET 2021 Results: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..

Secretariat Employees: ఏపీ సచివాలయ ఉద్యోగులకు షాక్‌.. బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..