AP ECET Results 2024: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలను నేరుగా ఇక్కడ చెక్ చేసుకోండి..

|

May 30, 2024 | 11:46 AM

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చైర్మన్, కన్వీనర్ వెల్లడించారు. AP ECET పరీక్షలను మే8న నిర్వహించారు.

AP ECET Results 2024: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఫలితాలను నేరుగా ఇక్కడ చెక్ చేసుకోండి..
Ap Ecet Results
Follow us on

ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం అనంతపురం- జేఎన్‌టీయూలో ఈసెట్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చైర్మన్, కన్వీనర్ వెల్లడించారు. AP ECET పరీక్షలను మే8న నిర్వహించారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 14 కేంద్రాలలో నిర్వహించిన AP ECET 2024 పరీక్షకు 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.

ఫలితాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

AP ECET 2024 జవాబు కీ మే 10న విడుదలైంది. తాత్కాలిక సమాధానాల కీతో సంతృప్తి చెందని అభ్యర్థులు మే 12 లోపు అభ్యంతరాలను తెలపడానికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థులు లేవనెత్తిన అన్ని సవాళ్లను పరిశీలించిన తర్వాత, విద్యామండలి ఈరోజు ఫలితాలను విడుదల చేశారు.

AP ECET 2024 స్కోర్‌కార్డ్‌ను ఎలా తనిఖీ చేయాలి?

  • cets.apsche.ap.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో, AP ECET ర్యాంక్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. మీ రిజిస్ట్రేషన్ నంబర్/హాల్ టిక్కెట్‌ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి..
  • మీ AP ECET ఫలితం 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.. భవిష్యత్తు అవసరాల నిమిత్తం ప్రింట్ తీసుకోండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.