AP ECET Answer Key 2021: ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం..

|

Sep 22, 2021 | 9:32 AM

AP ECET Answer Key 2021: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(అనంతపురం) ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ ని విడుదల చేసింది. అయితే, ఈ ఆన్సర్ కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే..

AP ECET Answer Key 2021: ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం..
Ap Ecet
Follow us on

AP ECET Answer Key 2021: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(అనంతపురం) ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ ని విడుదల చేసింది. అయితే, ఈ ఆన్సర్ కీ పై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలుంటే.. సెప్టెంబర్ 23వ తేదీలోపు తెలియజేయాలని యూనివర్సిటీ తెలిపింది. అభ్యర్థులు అధికారిక సైట్ అయిన sche.ap.gov.in. ద్వారా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చునని పేర్కొన్నారు. కాగా, ఫైనల్ ఆన్సర్‌ కీ ని అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున ఏపీ ఈసెట్ ఫలితాలను కూడా వెళ్లడించనున్నారు. ఇక అక్టోబర్ 5వ తేదీన ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. అయితే, ఆన్సర్ కీ పై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది ప్రాసెస్‌ని ఫాలో అవడం ద్వారా తమ అభ్యంతరాలను నమోదు చేయొచ్చు.

ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలను ఎలా నమోదు చేయాలంటే..
ముందుగా ఏపీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.in ను సందర్శించాలి.
ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ 2021 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. లేదా, హోమ్ పేజీలో ఉన్న ‘కీ అబ్జెక్షన్ రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేయండి.
లాగిన్ వివరాలను నమోదు చేసి.. ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఆ తరువాత ఏదైనా ప్రశ్నకు అభ్యంతరాలు ఉంటే.. నమోదు చేయాలి.
అయితే, ఆన్సర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఈ సైట్ ద్వారానే చెల్లించవచ్చు.
అభ్యంతరాలు పూర్తయిన తరువాత.. సబ్మిట్ కొట్టాలి.
ఫ్యూచర్ అవసరాల కోసం ఆన్సర్ కీ, అబ్జెక్షన్ వివరాల హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని పెట్టుకోండి.

‘ఆన్సర్ కీ’ ని డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యంతరాలు లేవనెత్తడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Also read:

బ్యాలెట్ బాక్సులో బయటపడ్డ మందుబాబు చీటీ.. చదివి షాక్ అయిన అధికారులు.. వీడియో

Viral Video: కుక్క కోసం బిజినెస్‌ కేబిన్‌ మొత్తం బుక్‌ చేసిన యజమాని.. ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?? వీడియో

శ్రీకాకుళానికి చెందిన నందిత బన్న.. మిస్ యూనివర్స్ సింగపూర్ 2021.. వీడియో