
అమరావతి, ఆగస్ట్ 10: ఆంధ్రప్రదేశ్ EAPCET 2026 కౌన్సెలింగ్‌లో భాగంగా తొలి దశ సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు తమకు కేటాయించిన సీటును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 10 నుంచి 15, 2026లోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కాలేజీలో నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. అభ్యర్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు కౌన్సెలింగ్ సమయంలో నమోదు చేసిన వెబ్ ఆప్షన్లు, మెరిట్ ర్యాంక్, కేటగిరీ ఆధారంగా సీట్లు కేటాయించారు. ఇందులో SC, ST, BC, PwD, NCC, CAP, Sports & Games వంటి రిజర్వేషన్ కేటగిరీలను కూడా పరిగణనలోకి తీసుకుని సీట్లను కేటాయించారు.
AP EAPCET 2026 సీట్ల కేటాయింపు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీటు పొందిన అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోదు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో పాటు కేటాయించిన కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఆగస్టు 10 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 15 వరకు ఈ ప్రక్రియకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు కాలేజీకి వెళ్లేటప్పుడు డౌన్‌లోడ్ చేసుకున్న అలాట్‌మెంట్ ఆర్డర్, సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్లాలి. కేటాయించిన సీటును నిలుపుకోవాలంటే రెండు రకాల రిపోర్టింగ్ ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. వీటిలో ఏ ఒక్క ప్రక్రియను మాత్రమే పూర్తి చేసి మరోదాన్ని పూర్తి చేయకపోతే సీటు కొనసాగదు. ఆగస్టు 15లోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ రెండింటినీ పూర్తి చేయని అభ్యర్థులకు కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా తదుపరి దశ సీట్ల కేటాయింపులోనూ వారిని పరిగణనలోకి తీసుకోరు.
తొలి దశలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు 10 నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. కాబట్టి సీటు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం ముఖ్యమని అధికారులు సూచిస్తున్నారు. AP EAMCET 2026 కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, రిపోర్టింగ్ తేదీలు, తదుపరి దశలకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పరిశీలించాలని, సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దని అధికారులు సూచించారు.