AP EAPCET 2023 Counseling: ఏపీ ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జులై 24 నుంచి రిజిస్ట్రేషన్లు

|

Jul 21, 2023 | 1:34 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ చదలవాడ నాగరాణి..

AP EAPCET 2023 Counseling: ఏపీ ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. జులై 24 నుంచి రిజిస్ట్రేషన్లు
AP EAPCET 2023 Counseling
Follow us on

అమరావతి, జులై 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు.

ఏపీ ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

  • జులై 24 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ
  • జులై 25 నుంచి ఆగస్టు 4 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • కోర్సులు, కాలేజీల ఎంపికకు సంబంధించి ఆప్షన్ల నమోదుకు ఆగస్టు 3 నుంచి 8 వరకు అవకాశం
  • ఆగస్టు 9న ఆప్షన్ల మార్పు
  • ఆగస్టు 12న సీట్ల వివరాలకు సంబంధించిన జాబితా ప్రకటన
  • సీట్లు పొందిన విద్యార్ధులు ఆగస్టు 13, 14 తేదీల్లో సీట్లు పొందిన కాలేజీల్లో తప్పనిసరిగా చేరాల్సి ఉంటుంది
  • ఇంజనీరింగ్‌ తరగతులు ఆగస్టు 16 నుంచి ప్రారంభం

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.42 వేలు నిర్ణయించినట్లు కన్వినర్‌ తెలిపారు. ఈ ఏడాది నుంచి అంటే 2023-24 నుంచి మూడేళ్లపాటు ఇదే ఫీజులు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. గత మూడేళ్లకు గరిష్ఠంగా రూ.70వేలు, కనిష్ఠంగా రూ.35వేలు ఫీజు నిర్ణయించగా.. పెరిగిన ధరల నేపధ్యంలో ఫీజులను నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష ఫీజు ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీలు పదిలోపు ఉన్నాయి. అత్యధిక కాలేజీలకు ఫీజు రూ.42 వేలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.