AP DSC Free Coaching: ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు.. సర్కార్ స్పందించేనా?

|

Jul 01, 2024 | 4:35 PM

ఏపీలో త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి అభ్యర్ధులు పోటాపోటీగా సన్నద్ధమవుతున్నారు. అయితే మైదాన, ఏజెన్సీలకు చెందిన గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌ కోరారు. గిరిజనులు ఆర్థికంగా ఏ మాత్రం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారని, నాణ్యమైన మెటీరియల్ కొనేందుకు..

AP DSC Free Coaching: ఎస్టీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్‌ ఇవ్వాలంటూ అభ్యర్ధనలు.. సర్కార్ స్పందించేనా?
DSC Free Coaching for ST aspirants
Follow us on

అమరావతి, జులై 1: ఏపీలో త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి అభ్యర్ధులు పోటాపోటీగా సన్నద్ధమవుతున్నారు. అయితే మైదాన, ఏజెన్సీలకు చెందిన గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ మేరకు గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్‌ కోరారు. గిరిజనులు ఆర్థికంగా ఏ మాత్రం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారని, నాణ్యమైన మెటీరియల్ కొనేందుకు, కోచింగ్‌ తీసుకునేందుకు వారికి స్థోమత లేదని ఆయన అన్నారు.

డీఎస్సీలో కొలువులు దక్కించుకోవాలంటే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఐటీడీఏల ద్వారా లేదంటే ఇతర ఏజెన్సీల ద్వారా గిరిజన అభ్యర్ధులకు ఉచిత కోచింగ్‌ సౌకర్యం కల్పించాలని జూన్‌ 30న ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సిందే.

తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్స్‌లో యూజీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ గిరిజన స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో సివిల్‌ సర్వీసెస్‌ 2025 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుకు గడువు ముగియడంతో దరఖాస్తు గడువు జులై 7 వరకు పొడిగిస్తూ గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దరఖాస్తు గడువు పెంపొందించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన వారందరికీ రాజేంద్రనగర్‌లోని స్టడీసర్కిల్‌లోనే శిక్షణ కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొంది. అయితే కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రమే స్టడీసర్కిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.