KNRUHS Admissions 2022: ‘ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఒక్క సర్టిఫికెట్‌ కూడా రాలేదు’ క్లారిటీ ఇచ్చిన డైరెక్టరేట్‌

|

Nov 07, 2022 | 7:39 PM

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ అభ్యర్ధులకు ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నవంబర్‌ 5న కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీకి సంబంధించిన ఓ ప్రకటన వెలువడింది. ఐతే ఈ ప్రకటన ప్రకారం అభ్యర్ధులు..

KNRUHS Admissions 2022: ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ఒక్క సర్టిఫికెట్‌ కూడా రాలేదు క్లారిటీ ఇచ్చిన డైరెక్టరేట్‌
AP&T NCC Directorate clarification on verification of NCC Certificates
Follow us on

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ అభ్యర్ధులకు ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు నవంబర్‌ 5న కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీకి సంబంధించిన ఓ ప్రకటన వెలువడింది. ఐతే ఈ ప్రకటన ప్రకారం అభ్యర్ధులు ఎన్‌సీసీ సర్టిఫికెట్లతో అడ్మిషన్‌ కోసం వస్తే, వాటిని నిరాకరించినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. తాజాగా వర్సిటీ దీనిపై వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల ఎన్‌సీసీ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేయడానికి నిరాకరించలేదని స్పష్టం చేసింది. ఐతే ఇప్పటి వరకు ఒక్క ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ కూడా తమ పరిశీలనకు రాలేదని కాలోజీ హెల్త్‌ వర్సిటీ తెల్పింది.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ దీనిలోని చట్ట పరమైన కేసుల గురించి 2022 ఆగస్టులో తెలంగాణ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖతో సమీక్ష నిర్వహించిందని, ఐతే దీనిపై ఆ శాఖ నుంచి ఇంకా వివరణ రాలేదని తెలుపుతూ సోమవారం (నవంబర్‌ 7) ప్రకటన వెలువరించింది. అసౌకర్యానికి గురైన విద్యార్ధులను క్షమాపణలు కోరింది. కాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్యవిద్య సీట్లకు యాజమాన్య కోటాలో రెండో విడత ప్రవేశాలను కల్పించేందుకు ఈ రోజు (న‌వంబ‌రు 7) రాత్రి 8 గంటల్లోపు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవల్సిందిగా కాలోజీ హెల్త్‌ వర్సిటీ సూచించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.