AP 10th Class Supply Exam Results 2023: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష-2023ల ఫలితాలు ఈ రోజు (జూన్ 23) విడుదలకానున్నాయి. ఈ మేరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదలచేయనున్నట్లు తెల్పుతూ శుక్రవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వైబ్‌సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చన్నారు. వెబ్‌సైట్‌లోకి లాగ్‌ఇన్ అయ్యాక సంబంధిత పాఠశాలకు చెందిన విద్యార్థుల ఫలితాలు ఉంటాయన్నారు. మార్కుల జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
కాగా ఏపీ టెన్త్ సప్లిమెఒంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు మొత్తం 2,12,221 మంది విద్యార్థులు సప్లి పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో 1.87 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.