AP TET 2024 Last Date: ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ

|

Aug 02, 2024 | 6:41 PM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్ష గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. జులై 3వ తేదీ ప్రారంభమైన ఆన్‌లైన్‌ టెట్ దరఖాస్తులు ఆగస్టు 3వ తేదీలో ముగియనున్నాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు గడువు పొడిగించేది లేదని ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది కూడా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరింది..

AP TET 2024 Last Date: ఏపీ టెట్ అభ్యర్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ
AP TET 2024 Last Date
Follow us on

అమరావతి, ఆగస్టు 2: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్ష గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. జులై 3వ తేదీ ప్రారంభమైన ఆన్‌లైన్‌ టెట్ దరఖాస్తులు ఆగస్టు 3వ తేదీలో ముగియనున్నాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తు గడువు పొడిగించేది లేదని ఇప్పటికే విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది కూడా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ కోరింది. కాగా టెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ టీచర్లకు ఉంటుంది. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు.

ఇక ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా 1 నుంచి 5 తరగతుల బోధనకు పేపర్-1 (ఎ, బి), 6 నుంచి 8 తరగతుల బోధనకు పేపర్-2 (ఎ, బి)లో విధిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటీజీ ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 3వ తేదీ గడువు సమయం ముగింపులోగా దరఖాస్తు చేసుకోవాలి. టెట్‌ స్కోర్‌కు లైఫ్‌ టైం వ్యాలిడిటీ ఉంటుంది. టెట్ పరీక్షలో ఓసీ (జనరల్‌)- 60 శాతం మార్కులు, బీసీ 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ 40 శాతం మార్కులు ఆపైన‌ సాధిస్తేనే అర్హత సాధిస్తారు.

పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలలో మొత్తం 150 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉంటుంది. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. సెప్టెంబర్‌ 22 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక అక్టోబర్‌ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష అనంతరం ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ అక్టోబర్‌ 04 నుంచి అందుబాటులో ఉంచుతారు. అక్టోబర్ 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. తుది ఆన్సర్ కీ అక్టోబర్ 27న విడుదల చేస్తారు. టెట్‌ ఫలితాలు నవంబర్ 2వ తేదీన ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.