AP SSC Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. పరీక్షా ఫలితాలను సోమవారం (జూన్6) రోజున విడుదల చేయనున్నట్లు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం ఫలితాలను విడుదల చేయనున్నామని ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు, తల్లిదండ్రులు గమనించాలని గవర్నమెంట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే వైసీపీ అధికారికంలోకి వచ్చిన తర్వాత టెన్త్ ఫలితాలను విడుదల చేస్తుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..