
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వివిధ ఐసిడియస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 171 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో అంగన్‌వాడీ కార్యకర్తల (AWW) పోస్టులు 30, అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు (AWH) 141 వరకు ఉన్నాయి. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
వైఎస్ఆర్ కడప జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత కర్నూల్ జిల్లా గ్రామస్థులై ఉండాలి. ముఖ్యంగా దరఖాస్తుదారులు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన వివాహిత మహిళలై ఉండాలి. దరఖాస్తు చేసుకునే మహిళల వయోపరిమితి జులై 1, 2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో కనీస వయస్సు 18 ఏళ్లుగా పరిగణిస్తారు. ఈ అర్హతలు కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 13, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ కింది అడ్రస్‌లో దరఖాస్తులను సమర్పించవల్సి ఉంటుంది. ఎంపిక విధానం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. అయితే ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
ఇందులో 10వ తరగతి మార్కులకు 50 మార్కులు కేటాయిస్తారు. ప్రీ-స్కూల్ శిక్షణ తీసుకున్న వారికి 5 మార్కులు, వితంతువులకు 5 నుంచి 10 మార్కులు ఉంటాయి. అనాథలకు 10 మార్కులు, వికలాంగులకు 5 మార్కులు చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 23, 2026వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్వ్యూని సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోండి.
వైఎస్ఆర్ కడప జిల్లా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.