అమరావతి, డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ ఎస్సై ఫలితాల వెల్లడిపై హైకోర్టు ఎత్తి వేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఎస్సై అభ్యర్థుల ఎత్తు కొలత ప్రక్రియ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎత్తు విషయంలో పిటిషనర్లు అర్హులేనంటూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలంటూ గుంటూరు ఐజీని న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో వైద్యులు ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలవగా అనర్హులని తేలింది. దీంతో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా? లేక రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సొమ్ము చెల్లించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.
పిటిషనర్లు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు విషయంలో అర్హత సాధించారన్నారు. పిటిషనర్లు ఎత్తు విషయంలో అర్హులేనని ప్రభుత్వ వైద్యులు తాజాగా ధ్రువపత్రాలు ఇచ్చారని అభ్యర్థుల తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలను కోర్టు ముందు ఉంచామని అన్నారు. కోర్టు ముందు చేసిన పరీక్షలను తప్పుపడతారా? కోర్టుపైనే నింద మోపేందుకు యత్నిస్తున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అభ్యర్థులు సమర్పించిన ధ్రువపత్రాలపై విచారణ జరపాలని గుంటూరు ఐజీని ఆదేశించింది. బోర్డు చెబుతున్న ఎత్తు, ప్రస్తుతం తీసిన ఎత్తు ఒకే విధంగా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది. ఫలితాల ప్రకటనను నిలువరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2024 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 200 నగరాల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్టు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించి వివరణాత్మక షెడ్యూల్‌ను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు (IISc) విడుదల చేసింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.