AP DSC 2024 Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు! డైరెక్ట్ లింక్ ఇదే

|

Oct 19, 2024 | 2:47 PM

నిరుపేద నిరుద్యోగులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు ముందుకొచ్చాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ కింది లింక్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరో ముఖ్య గమనిక దరఖాస్తు గడువు మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..

AP DSC 2024 Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. 2 రోజుల్లో ముగుస్తున్న గడువు! డైరెక్ట్ లింక్ ఇదే
AP DSC 2024 Free Coaching
Follow us on

అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ కోసం ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెట్‌ పరీక్ష 2024ను కూడా మరోమారు నిర్వహిస్తున్నారు. డీఎస్సీ పరీక్ష రాసేందుకు అధికమందికి అవకాశం కల్పించాలనే ఉద్ధేశ్యంతో టెట్‌ మరోమారు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన టెట్‌ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీ వరకు జరగనున్నాయి. నవంబరు 2న టెట్‌ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆ మరుసటి రోజే అంటే నవంబర్‌ 3న డీఎస్సీ ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

డీఎస్సీకి ఉచిత కోచింగ్‌

నిరుపేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసి టెట్‌లో అర్హత సాధించిన నిరుద్యోగ అభ్యర్ధులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జ్ఞానభూమి పోర్టల్‌ ద్వారా లో అక్టోబర్‌ 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. అక్టోబర్‌ 27వ తేదీ ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కులు 15 శాతం వరకు వెయిటేజీ ఇచ్చి అభ్యర్థుల తుది జాబితా ఎంపిక చేస్తారు. ఎంపికయిన వారికి 3 నెలలపాటు ఉచితంగా రెసిడెన్షియల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజనం సౌకర్యం కూడా కల్పిస్తారు.

అక్టోబరు 30న ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 3న ఆయా శిక్షణ సంస్థలకు అభ్యర్థులను కేటాయిస్తారు. నవంబర్‌ 6వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఎస్జీటీ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.10 వేలు, స్టడీ మెటీరియల్‌కు రూ.3 వేలు, డైట్‌ బిల్లు నెలకు రూ.4,500 చొప్పున మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం ఒక అభ్యర్థిపై రూ.26,500 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు శిక్షణ కోసం ఫీజు రూ.12 వేలు, స్టడీ మెటీరియల్‌కు రూ.3 వేలు, డైట్‌ బిల్లు మూడు నెలలకు రూ.13,500 కలిపి మొత్తం రూ.28,500 ఒక్కో అభ్యర్ధికి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తం 5,050 మంది అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050 సీట్లు, ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.