AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TET 2024 Result Date: టెట్‌ ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యర్ధులు ఈ కింది లింక్ ద్వారా నేరుగా ఆన్సర్ కీలను చెక్ చేసుకోవచ్చు..

AP TET 2024 Result Date: టెట్‌ ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ' విడుదల.. మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఆన్‌లైన్‌ పరీక్షలు
AP TET 2024 answer keys
Srilakshmi C
|

Updated on: Oct 19, 2024 | 2:11 PM

Share

అమరావతి, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 పరీక్షలు మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమైన టెట్‌ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీతో ముగియనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ముగిసిన పరీక్షలకు సంబంధించిన ఆన్సర్‌లను విద్యాశాఖ వెబ్‌సైట్‌లోకి అందుబాటులోకి తీసుకువస్తుంది. పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత ప్రశ్నాపత్రం, ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మేరకు అక్టోబర్‌ 3 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

అభ్యంతరాల స్వీకరణ కూడా మొదలైంది. ఏదైనా ప్రశ్నపై అభ్యంతరాలు లేవనెత్తే అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో తెలపవచ్చు. పేపర్‌ 2ఎ (మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌) పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’లపై అభ్యంతరాలను అక్టోబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. ఇక అక్టోబర్ 21న టెట్‌ పరీక్షలు ముగిశాక వెనువెంటనే మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అభ్యంతరాలు స్వీకరణ అనంతరం అక్టోబర్‌ 27న తుది ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేసి తుది ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్‌ 2వ తేదీన టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత రోజే అంటే నవంబర్ 3వ తేదీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 (జులై) ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌ టెట్‌ 2024 (జులై) రెస్పాన్స్‌ షీట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్ధులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాలు మానివేసి మరీ సీరియస్ గా డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైతే ప్రిపరేషన్ కు విద్యాశాఖ 3 నెలలు గడువు ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రకారంగా చూస్తే డీఎస్సీ పరీక్షలు జవవరిలో ఉండే అవకాశం ఉంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!