Andhra Pradesh: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కూటమి సర్కార్.. అసలింతకీ సంగతేమంటే?

2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కూటమి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులకు మరో 20 కొత్త యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయన్నట్లు జేఎన్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి కేవిఎస్‌జీ మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే కూటమి సర్కార్‌ ఏర్పాట్లు ప్రారంభించినట్లు వెల్లడించారు..

Andhra Pradesh: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన కూటమి సర్కార్.. అసలింతకీ సంగతేమంటే?
new universities to AP

Updated on: Feb 15, 2025 | 4:13 PM

అమరావతి, ఫిబ్రవరి 15: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సాంకేతిక విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయన్నట్లు జేఎన్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి కేవిఎస్‌జీ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు కూటమి సర్కార్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చిన్న చిన్న కళాశాలలను యూనివర్సిటీలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే 3 ఇంజినీరింగ్‌ కాలేజీలను యూనివర్సిటీలుగా మార్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో క్రీడల పరంగా 0.5 క్రెడిట్‌ అందించామని, ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో మరో 2 అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లు ఏర్పాట్లు

ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోనూ మరో రెండు అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లు రానున్నాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ వైద్య విద్య సంచాలకుల కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి వైద్య కాలేజీలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌ ఉంటుంది. విద్యార్థులకు వైద్య విద్య పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు ఇందులో ప్రాథమిక స్థాయి శిక్షణ పొందుతారు. దీంతోపాటు అధ్యాపకులు తప్పనిసరిగా అడ్వాన్స్‌డ్‌ శిక్షణ కూడా పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటివి రెండు సెంటర్ల ఉన్నాయి. ఒకటి హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల కాగా, మరొకటి వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ).

ఈ రెండింటిలో మాత్రమే అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌ ఉంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరగడంతో మరో 2 అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ మేరకు వీటిని నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి, సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం లభించిన వెంటనే రెండు కేంద్రాలు నెలకొల్పనున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.