Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసిన కూటమి సర్కార్‌! నేటి నుంచే దరఖాస్తులు

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు (మే 16) నుంచి జూన్‌ 2 వరకు రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అర్హతలపై..

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసిన కూటమి సర్కార్‌! నేటి నుంచే దరఖాస్తులు
AP govt relaxes ban on transfer of employees

Updated on: May 16, 2025 | 12:36 PM

అమరావతి, మే 16: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు (మే 16) నుంచి జూన్‌ 2 వరకు రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల్లో రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉద్యోగుల బదిలీలపై మే 16 నుండి జూన్ 2 వరకు నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్‌ 2 వరకు సాధారణ బదిలీలకు సైతం అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. మే 31, 2025 నాటికి ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని తాజా ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.

అలాగే గతంలో పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారికీ కూడా బదిలీలకు అవకాశం కల్పించారు. ఇక ఐదేళ్లలోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు ఉంటాయని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మే 31లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు మాత్రం బదిలీలు ఉండబోవని, వీరికి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులు వినతి చేసుకుంటే.. ఆ మేరకు బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వీరితోపాటు ట్రైబల్ ఏరియాలో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు కూడా బదిలీల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మెడికల్ గ్రౌండ్‌ బదిలీల్లోనూ ఉద్యోగుల వినతి మేరకు బదిలీలు ఉంటాయి. వితంతు ఉద్యోగులకు వినతి మేరకు బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు. స్పౌజ్ ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గరి ప్రాంతాల్లో బదిలీ చేసేలా అవకాశం ఉంది.

మే 19 నుంచి సీయూఈటీ యూజీ 2025 పరీక్షలు.. వెబ్‌సైట్‌లో అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల

దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు కేంద్ర ఆధీనంలో నడిచే విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ యూజీ 2025 అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్దులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 19 నుంచి 24 వరకు ప్రవేశ పరీక్షలు దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

సీయూఈటీ యూజీ 2025 అడ్మిట్‌ కార్డ్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.