AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జూన్ 1 నుండి జూలై 16 వరకు పాఠశాలలకు సెలవులు.. ఎక్కడెక్కడ అంటే..!

Summer Holidays 2025: వేసవి సెలవులు పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి వారి అభిరుచులను నెరవేర్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ 46 రోజుల్లో పిల్లలు చదువుతో పాటు అనేక ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన పనులు చేయవచ్చు. పిల్లలు పాఠశాల కాకుండా..

Summer Holidays 2025: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. జూన్ 1 నుండి జూలై 16 వరకు పాఠశాలలకు సెలవులు.. ఎక్కడెక్కడ అంటే..!
Subhash Goud
|

Updated on: May 16, 2025 | 6:13 PM

Share

దేశంలో పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సెలవులే సెలవులు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూన్ 1 నుండి జూలై 16 వరకు 46 రోజుల వేసవి సెలవులను విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

సెలవులు 46 రోజులకు పొడిగింపు

వివిధ రాష్ట్రా, ప్రాంతాల నిబంధనల ప్రకారం.. సెలవుల తేదీలు కొద్దిగా మారవచ్చు. కానీ చాలా పాఠశాలలు విద్యా మంత్రిత్వ శాఖ నిర్దేశించిన జాతీయ మార్గదర్శకాలను అనుసరిస్తాయి. దీని అర్థం కొన్ని రాష్ట్రాల్లో సెలవుల ప్రారంభ, ముగింపు తేదీలు భిన్నంగా ఉన్నప్పటికీ, విద్యార్థులు అవసరమైన విశ్రాంతి పొందగలిగేలా అన్ని పాఠశాలలు దాదాపు ఒకే సమయంలో వేసవి సెలవులను ఇస్తాయి.

ఏ రాష్ట్రంలో సెలవులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

ప్రతి రాష్ట్రంలో సెలవుల తేదీలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు. కానీ చాలా చోట్ల పాఠశాలలు జూన్ ప్రారంభం నుండి జూలై మధ్య వరకు మూసి ఉంటాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, బీహార్‌లలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండూ జూన్ 1 నుండి జూలై 16, 2025 వరకు మొత్తం 46 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.

మహారాష్ట్ర, కర్ణాటకలోని అన్ని పాఠశాలలు మే 30 నుండి జూలై 14 వరకు మూసి ఉంటాయి. అదే సమయంలో రాజస్థాన్‌లో మే 31 నుండి జూలై 15 వరకు సెలవులు ఇచ్చారు. ఇది ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో జూన్ 2 నుండి జూలై 17 వరకు పాఠశాలలకు సెలవులు ఉండనున్నాయి. ఇక్కడ మొత్తం 45 రోజుల సెలవులు ఉంటాయి.

వేసవి సెలవులు ఎందుకు అవసరం?

అదే సమయంలో వేసవి సెలవులు చదువు నుండి విరామం తీసుకోవడానికి మాత్రమే కాదు, పిల్లల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ 46 రోజుల సెలవులను సకాలంలో ప్రకటించారు. తద్వారా పిల్లలు పాఠశాల కాకుండా ఇతర కార్యకలాపాలు చేయవచ్చు. ఈ 46 రోజుల సెలవుల్లో పిల్లలు చదువుతో పాటు అనేక ఇతర విషయాలను నేర్చుకోవచ్చు.

వేసవి సెలవులు పిల్లలు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి వారి అభిరుచులను నెరవేర్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ 46 రోజుల్లో పిల్లలు చదువుతో పాటు అనేక ఆహ్లాదకరమైన, ప్రయోజనకరమైన పనులు చేయవచ్చు.

  1. కొత్త అభిరుచులను అలవర్చుకోండి: పిల్లలు పెయింటింగ్, సంగీతం, నృత్యం లేదా తోటపని వంటి కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా వారి అభిరుచులను పెంచుకోవచ్చు.
  2. చదువుతో పాటు చదవడం: పాఠశాల పుస్తకాలతో పాటు, కథలు, సైన్స్ లేదా ఏదైనా కొత్త సమాచారం ఉన్న పుస్తకాలను చదవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. ఆన్‌లైన్ కోర్సులు చేయండి: కొన్ని చిన్న ఆన్‌లైన్ కోర్సులు చేయడం ద్వారా వారు కోడింగ్, భాష లేదా డ్రాయింగ్ వంటి కొత్త విషయాలను నేర్చుకోవచ్చు.
  4. క్రీడలు, వ్యాయామం: ప్రతిరోజూ క్రీడలు, యోగా కోసం కొంత సమయం కేటాయించడం ఆరోగ్యానికి మంచిది.
  5. కుటుంబంతో సమయం గడపండి: ఇంట్లో తల్లిదండ్రులు, తాతామామలతో సమయం గడపడం వల్ల పిల్లల అనుభవం, అవగాహన పెరుగుతుంది.
  6. కొత్త అనుభవాలను పొందండి: కొత్త ప్రదేశానికి ప్రయాణించడం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కూడా మీ సెలవులను సద్వినియోగం చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి