AP Schools Reopen: కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. అన్ని రకాల బోర్డు పరీక్షలు రద్దు కాగా.. స్కూళ్లు, కాలేజీలు చాలా రోజులుగా మూతపడే ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసిన విషయం విధితమే. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడిన నేపథ్యంలో.. ఏపీలో పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరుస్తామని తాజాగా ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే 60 శాతం ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని.. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు చేపట్టామని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంపై జరిగిన చర్చ అనంతరం ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. పాఠశాలలను ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభిస్తామని తెలిపారు. ఆన్‌లైన్ తరగతులను జులై 12 నుంచి ప్రారంభించనున్నామని.. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు టీచర్లకు వర్క్ బుక్స్‌పై శిక్షణ తరగతులను నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను జులై చివరి నాటికి విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక సెకండ్ ఆయర్ ఫలితాల కోసం పదో తరగతి ఫలితాల నుంచి 30 శాతం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల నుంచి 70 శాతం వెయిటేజ్‌గా తీసుకోనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలోనే ‘నాడు నేడు’ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివరి నాటికి అన్ని పనులు పూర్తికావాలని సూచించారు.
Also Read: ‘ఆపద సమయంలో తమ చేత లెక్కలేనంత చాకిరీ చేయించుకుని.. ఇప్పుడు అవసరం తీరింది కదాని తొలగిస్తారా..?’
CM YS Jagan: క్రికెట్ ఆడిన సీఎం జగన్.. క్లాసీ షాట్స్‌తో కరేజ్ చూపించారు.. క్లాప్స్ కొట్టించారు
Mani Ratnam Navarasa : నవరసాలను చూపించిన మణిరత్నం.. ఆకట్టుకుంటున్న టీజర్