AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

|

Jul 26, 2021 | 7:24 AM

AP Polycet 2021: కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన...

AP Polycet 2021: ఏపీ పాలిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విద్యాశాఖ.. పరీక్ష ఎప్పుడు నిర్వహించనున్నారంటే.
Ap Polycet
Follow us on

AP Polycet 2021: కరోనా ప్రభావం తగ్గుతుండడంతో క్రమేణా అన్ని రకాల ఎంట్రన్స్‌ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తాజాగా పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్‌ కాలేజీలలో వివిధ డిప్లమా కోర్సులలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీన పాలిసెట్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షకు రాష్ట్రంలోని 45 పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలు పాలిసెట్ పరీక్షకు సమన్వయ అధికారులుగా వ్యవహరించనున్నారు. పాలిసెట్‌ పరీక్ష రాయడానికి అర్హత, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడన్న పూర్తి వివరాలు ఓసారి చూద్దాం.

* పాలిసెట్‌ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎస్‌.ఎస్‌.సి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది ఉండాలి. పరీక్షకు మార్చి/ఏప్రిల్‌ 2021లో హాజరైన విద్యార్థులు అర్హులు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 26-07-2021 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 01-09-2021ని నిర్ణయించారు.
* పాలిసెట్‌ 2021 పరీక్షను 01-09-2021న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం http://sbtetap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి https://polycetap.nicinను చూడండి.

Also Read: JEE Exams 2021: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష..

NEET 2021 Exam: త్వరలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ..