ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. సోమవారం (రేపు) మధ్యాహ్నం 12 గంటల నుంచి హాల్ టికెట్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈనెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాన్నాయి. ఈ ఏడాది మొత్తం 6 లక్షల మంది 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పాఠశాల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యా శాఖ స్పష్టం చేసింది.
* మార్చి 18- ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1
* మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్
* మార్చి 20- ఇంగ్లిష్
* మార్చి 22- మ్యాథ్స్
* మార్చి 23- ఫిజికల్ సైన్స్
* మార్చి 26- బయాలజీ
* మార్చి 27- సోషల్ స్టడీస్
* మార్చి 28- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1
* మార్చి 30- ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), ఓకేషనల్ కోర్సు పరీక్ష ఉంటుంది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..