Mega DSC 2024 Free Coaching: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం: మంత్రి సవిత

నిరుద్యోగ నిరుపేద అభ్యర్ధులకు మెగా డీఎస్సీలో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. మొత్తం 5200 మందికి ఉచిత కోచింగ్ తో పాటు స్టైపెండ్, మెటీరియల్ కు అదనంగా నగదు ఇవ్వనున్నారు..

Mega DSC 2024 Free Coaching: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం: మంత్రి సవిత
Minister Savitha
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 14, 2024 | 2:50 PM

అమరావతి, నవంబర్ 12: రాష్ట్రంలో త్వరలో వెలువడనున్న మెగా డీఎస్సీకి ఇప్పటికే అభ్యర్ధులుఉ ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. కొందరు వేలకు వేలు డబ్బు కట్టి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. కోచింగ్ తీసుకునే స్థోమతలేని వారు ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు. అయితే మెగా డీఎస్సీకి సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుభవార్త చెప్పారు. బీసీ స్డడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఉచితంగా డీఎస్సీ కోచింగ్ ఇచ్చేందుకు సెంటర్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వీరికి 2 నెలల పాటు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వడమేకాకుండా.. నెలకు రూ.1500 స్టైపెండ్‌, మెటీరియల్ కోసం మరో రూ.వెయ్యి ఇస్తారని తెలిపారు. నవంబర్‌ 16 నుంచి నుంచి బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లో ఈ బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయని, వీటి ఆధ్వర్యంలో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కోచింగ్ సెంటర్​లో 200 మంది అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,200 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ బీసీ స్టడీ సర్కిళ్లలో బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామని అన్నారు. వీరితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా మరో 520 సీట్లు కేటాయించామని అన్నారు.

ఎస్‌బీఐ ఎస్‌ఓ నియామక రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. త్వరలో అడ్మిట్‌కార్డులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ నియామక రాత పరీక్ష తేదీ విడుదలైంది. ఈ మేరకు ఎస్‌బీఐ అధికారిక ప్రకటనను జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 23వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ కింద అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!