ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఎయిడెడ్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ఎట్టకేలకు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల ఖాళీల వివరాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు జారీచేసి, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్లో ఖాళీల వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇప్పటికే కొన్ని పాఠశాలల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. మరికొన్నింటిలో పూర్తయింది. మిగిలిన పాఠశాలల్లో త్వరలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి బాపట్ల జిల్లాలోని బల్లికురవ సీఏ యూపీఎస్ వల్లపల్, పల్నాడు జిల్లాలోని నకరికల్లు ఆర్‌జీఎం హైస్కూల్ పీహెచ్ చల్లగుండ్ల, పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో ఎస్వీకేపీ అండ్ ఎస్కేవీఆర్ హైస్కూల్‌లలో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, జూనియర్ లెక్చరర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సెకండరీ గ్రేడ్ టీచర్ తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు టెట్ లేదా సీటెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలని విద్యాశాఖ పేర్కొంది.
ఎయిడెడ్ బడుల్లో టీచర్ ఉద్యోగాలకు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 11వ తేదీతో పూర్తైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుకలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇచ్చిన గడువు తేదీని తాజాగా పొడిగిస్తూ ఐఐటీ రూర్కీ ప్రకటన జారీ చేసింది. ఇందుకు అభ్యర్ధులు నిర్ణీత ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఎగ్జామ్ సిటీ, జెండర్ తదితర విషయాల్లో మార్పులు చేసుకోవచ్చు. గేట్ దరఖాస్తులో మార్పులకు నవంబర్ 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇక గేట్ ఆన్‌లైన్ పరీక్ష 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.