AP Anganwadi Jobs 2022: పదో తరగతి అర్హతతో.. ఏపీలోని ఈ జిల్లాలో 120 అంగన్‌ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 120 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AP Anganwadi Jobs 2022: పదో తరగతి అర్హతతో.. ఏపీలోని ఈ జిల్లాలో 120 అంగన్‌ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..
Ap Anganwadi Jobs

Updated on: Jan 05, 2023 | 8:41 PM

WDCW AP Anganwadi Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 120 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత గ్రామానికి చెందిన వివాహమైన మహిళ అయ్యి ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 13, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపవల్సి ఉంటుంది. విద్యార్హతలను బట్టి తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి వేతనాలు ఈ కింది విధంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

  • అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.11500
  • మినీ అంగన్‌వాడీ వర్కర్లకు నెలకు రూ.7000
  • అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు రూ.7000లు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: సీడీపీవో కార్యాలయం, అనంతపురము జిల్లా, జిల్లామహిళా శిశు అభివృద్ధిసంస్థ, ఏపీ.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.