Amazon: విద్యార్థులకు అమెజాన్‌ గుడ్‌న్యూస్‌.. పాఠశాల స్థాయి నుంచే గ్లోబల్‌ కంప్యూటర్‌ సైన్స్‌..!

| Edited By: Anil kumar poka

Sep 30, 2021 | 8:30 AM

Amazon: కంప్యూటర్‌ సైన్స్‌ విద్య రంగంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది..

Amazon: విద్యార్థులకు అమెజాన్‌ గుడ్‌న్యూస్‌.. పాఠశాల స్థాయి నుంచే గ్లోబల్‌ కంప్యూటర్‌ సైన్స్‌..!
Follow us on

Amazon: కంప్యూటర్‌ సైన్స్‌ విద్య రంగంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ (ఏఎఫ్‌ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే మెరుగైన కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం అందిస్తారు. మొదటి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందు కోసం తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలను ఎంపిక చేస్తారు.

6-12 తరగతి విద్యార్థులకు..

అమెజాన్‌ ఫ్యూచర్‌ ఇంజనీర్‌ కార్యక్రమంలో భాగంగా 6-12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్‌ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్, నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి భవిష్యత్‌ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్‌ నిపుణులను కలిసే అవకాశం కూడా ఉంటుంది.

అలాగే అమెజాన్‌ సైబర్‌ రోబోటిక్స్‌ చాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్‌ బేసిక్స్, కోడింగ్‌ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉపకార వేతనాలు, ఇంటర్న్‌షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ కోడ్‌. ఓఆర్‌జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్‌ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు.

స్వచ్ఛంద సంస్థల సహకారంతో..

ఏఎఫ్‌ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్‌ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ఉపాధి రంగంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారిందని అమెజాన్‌ ఇండియా హెడ్‌ అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Electric Vehicles: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!