అలహాబాద్ హైకోర్టులో 3,932 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, గ్రూప్ ‘సీ’ క్లర్క్ క్యాడర్, డ్రైవర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి ఆరో తరగతి, పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనోగ్రాఫర్ సర్టిఫికెట్‌తోపాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 13, 2022వ తేదీ రాత్రి గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు సమయంలో స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.1000లు, గ్రూప్ ‘డి’ పోస్టులకు రూ.800లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా/ఈఎస్‌ఎమ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.