
హైదరాబాద్, నవంబర్ 5: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT) డిసెంబర్ 2025 సెషన్‌కి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మ్యాట్ పరీక్షరాసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యాట్ అనేది జాతీయ స్థాయిలో నిర్వహించే ఏకైక మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష డిసెంబర్ 13వ తేదీన, సీబీటీ ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్ 21న ఉంటుంది. విద్యార్ధులు తమకు నచ్చిన విధానంలో ఈ పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది. దేశ వ్యాప్తంగా 60 నగరాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక ఆఫ్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 7, 2025వ తేదీ వరకు స్వీకరిస్తారు. అడ్మిట్ కార్డులను డిసెంబర్ 10వ తేదీన వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఆన్‌లైన్ దరఖాస్తులను డిసెంబర్ 15 వరకు స్వీకరిస్తారు. అడ్మిట్ కార్డులను డిసెంబర్ 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇతర వివరాలు అధికార వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌కు సంబంధించిన తాత్కాలిక ఖాళీల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు పోస్టుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ ఏడాది జూన్ నెలలో వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఉన్న 437 గ్రూప్ ‘బి’ నాన్ గేజిటెడ్ పోస్టుల జాబితాను రిజర్వేషన్ల వారీగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సవరించిన పోస్టులతో కలిపి మొత్తం 552 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించిన పేపర్ 1 పరీక్ష ఆగస్టు 12న నిర్వహించింది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సీహెచ్‌టీఈ-2025 నోటిఫికేషన్ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఎస్సెస్సీ హిందీ ట్రాన్స్‌లేటర్-2025 తాత్కాలిక ఖాళీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.