AIIMS Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఇన్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వంటి పోస్టులను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ఖాళీలకు గాను ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్)–01, లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫెసర్),కాలేజ్ ఆఫ్ నర్సింగ్–05 ఖాళీలను భర్తీ చేయనుంది.
* ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్(కాలేజ్ ఆఫ్ నర్సింగ్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 55 ఏళ్లు మించకూడదు.
* లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 50ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* లెక్చరర్ ఇన్ నర్సింగ్(అసిస్టెంట్ ప్రొఫసర్), కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 నుంచి 2,08,700 జీతంగా చెల్లిస్తారు.
* ప్రొఫెసర్ కమ్ ప్రిన్సిపల్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100 నుంచి 2,15,900 వరకూ చెల్లిస్తారు.
* అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 14-09-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IIT Goa Recruitment: గోవా ఐఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. రూ. 70 వేలకుపైగా జీతం పొందే అవకాశం.
Railway Jobs: టెన్త్ పాసైన వారికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు..!
BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.