AIIMS Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఎయిమ్స్‌లో 114 ఉద్యోగాలు.. నెలకు రూ.67 వేల జీతం సంపాదించే అవకాశం..

|

Jan 11, 2023 | 2:04 PM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 114 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

AIIMS Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఎయిమ్స్‌లో 114 ఉద్యోగాలు.. నెలకు రూ.67 వేల జీతం సంపాదించే అవకాశం..
AIIMS Jodhpur Recruitment 2023
Follow us on

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 114 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనస్థీషియాలజీ అండ్‌ క్రిటికల్ కేర్, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, డయాగ్నోస్టిక్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆఫ్తాల్మాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెడికల్ పీజీ ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 3, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.800లు ఫీజు చెల్లించాలి. అకడమిక్‌ మెరిట్‌/రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.