AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిమ్స్‌ గువహతిలో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గువ‌హ‌తిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Guwahati) .. ఒప్పంద ప్రాతిపదికన 40 సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎయిమ్స్‌ గువహతిలో సీనియర్‌ రెసిడెంట్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
Aiims Guwahati

Updated on: Sep 19, 2022 | 7:03 AM

AIIMS Guwahati Senior Resident Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన గువ‌హ‌తిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Guwahati) .. ఒప్పంద ప్రాతిపదికన 40 సీనియర్ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్‌ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ ఆగస్టు 27, 2022వ తేదీన వెలువడింది. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: THE EXECUTIVE DIRECTOR, ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES, GUWAHATI, CHANGSARI, KAMRUP, ASSAM-781101.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.