
త్రివిధ దళాల్లో ఒకటైన వాయుసేనలో ఉన్నత ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్ 2026)కు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. యేటా రెండు సార్లు ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఆరు నెలలకూ ఏఎఫ్ క్యాట్ ప్రకటన వెలువడుతుందన్నమాట. వచ్చే ఏడాదికి తొలి విడత నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్ధులు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 తేదీల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇక జనవరి 2027లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్ 2026) ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కింద ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ: ఫ్లయింగ్/ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)/ గ్రౌండ్ డ్యూటీ (నాన్- టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీలో ఫ్లయింగ్ ఫోర్సు ఎంపికకు ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. ఏఎఫ్ క్యాట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి.. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు 20 నుంచి 24 ఏళ్లు, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ నాన్-టెక్నికల్) బ్రాంచ్‌కు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 9, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.550+జీఎస్‌టీ చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, శారీరక ప్రమాణాలు తదితర ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష జనవరి 31న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.