ADA Recruitment: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. రూ. 70 వేల వరకు జీతం.

| Edited By: Narender Vaitla

Jul 15, 2021 | 12:51 PM

ADA Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది...

ADA Recruitment: ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.. రూ. 70 వేల వరకు జీతం.
Ada Recruitment
Follow us on

ADA Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 68 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థులు 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా చెప్పాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* జీతాల విషయానికొస్తే.. రెండేళ్ల అనుభవం ఉన్న వారికి నెలకు రూ. 50,000+డియర్‌నెస్‌ అలవెన్స్, నాలుగేళ్ల అనుభవం ఉన్నవారికి రూ. 60,000+డియర్‌నెస్‌ అలవెన్స్, ఎనిమిదేళ్ల అనుభవానికి నెలకు రూ.70,000+డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఇస్తారు.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ ఇంటర్వూ, ఫైనల్‌ పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల ప్రక్రియ జులై 8న మొదలుకాగా, 29తో ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SVRRGG Hospital: తిరుపతిలోని ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాలనియామకం.. రేపే చివరి తేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Infosys: గ్రాడ్యుయేట్ల‌కు గుడ్ న్యూస్‌.. 35వేల మందికి ఉద్యోగ అవకాశాలు: ఇన్ఫోసిస్‌

Bank of Baroda Jobs 2021: గుడ్‌న్యూస్‌.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. రేపే చివరి తేదీ