AECS Hyderabad Recruitment 2022: బీఎడ్‌/ డీఎల్‌ఈడీ అర్హతతో.. హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగాలు..

|

May 19, 2022 | 5:32 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌ (AECS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

AECS Hyderabad Recruitment 2022: బీఎడ్‌/ డీఎల్‌ఈడీ అర్హతతో.. హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగాలు..
Aecs Hyderabad
Follow us on

AECS Hyderabad Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్ స్కూల్‌ (AECS Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ట్రైనీ గ్రాడ్యుయేట్‌ టీచర్ (TGT) పోస్టులు, ప్రైమరీ టీచర్‌ పోస్టులు (PRT)

ఇవి కూడా చదవండి

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,250 నుంచి రూ.26,250 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు:

  • ట్రైనీ గ్రాడ్యుయేట్‌ టీచర్ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో (హిందీ, ఇంగ్లీష్‌, సంస్కృతం, మ్యాథ్స్/ఫిజిక్స్‌, సోషల్‌ సైన్స్‌, ఆర్ట్స్) గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • ప్రైమరీ టీచర్‌ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సుతోపాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (DLED)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సెక్యూరిటీ ఆఫీస్‌, డీఏఈ ఎంట్రన్స్‌ కాలనీ, డి సెక్టర్ గేట్‌, కమలానగర్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌ – 500062.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.