Success Story: యాక్టర్‌ నుంచి పోలీస్ ఆఫీసర్.. రంగుల ప్రపంచం నుంచి అధికార విధుల్లోకి వచ్చిన అమ్మాయి విజయగాథ..!

బాలివుడ్‌లోని ఓ నటి నిలిచింది. తాను నటిస్తూ ఉండగానే సివిల్ సర్వీసెస్‌పై మక్కువ పెంచుకుని సక్సెస్‌ అయ్యింది. 2010 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి సిమ్లా ప్రసాద్‌ ఐఏఎస్‌ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌లకు సంతానం సిమ్లాప్రసాద్‌  ప్రారంభంలో నటనతో పాటు నృత్యం వైపు మొగ్గు చూపించింది. అయితే నటిగా ప్రయాణం ప్రారంభించిన సిమ్లా ప్రసాద్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఎలాఅయ్యిందో? ఓసారి తెలుసుకుందాం.

Success Story: యాక్టర్‌ నుంచి పోలీస్ ఆఫీసర్.. రంగుల ప్రపంచం నుంచి అధికార విధుల్లోకి వచ్చిన అమ్మాయి విజయగాథ..!
Simla Prasad

Updated on: Feb 06, 2024 | 5:30 PM

సమాజంలో చాలా మంది తమ జీవితాలు ఎటువైపు పయనిస్తున్నా సరైన గమ్యస్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నటుల జీవితాలు ఇందుకు ఉదాహరణగా ఉంటాయి. డిమాండ్‌ ఉన్నంతసేపే వారి అవకాశాలు వస్తాయి. ఒక్కసారి డిమాండ్‌ తగ్గిపోతే కనీసం వారి పట్టించుకునేవారే ఉండరు. అయితే వారు ఫామ్‌లో ఉన్నప్పుడే వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆయా రంగాల్లో సెటిల్‌ అవ్వాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే వీరికి భిన్నంగా బాలివుడ్‌లోని ఓ నటి నిలిచింది. తాను నటిస్తూ ఉండగానే సివిల్ సర్వీసెస్‌పై మక్కువ పెంచుకుని సక్సెస్‌ అయ్యింది. 2010 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి సిమ్లా ప్రసాద్‌ ఐఏఎస్‌ అధికారి భగీరథ్ ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మెహ్రున్నీసా పర్వేజ్‌లకు సంతానం సిమ్లాప్రసాద్‌  ప్రారంభంలో నటనతో పాటు నృత్యం వైపు మొగ్గు చూపించింది. అయితే నటిగా ప్రయాణం ప్రారంభించిన సిమ్లా ప్రసాద్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఎలాఅయ్యిందో? ఓసారి తెలుసుకుందాం.

భోపాల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన ఆమె కామర్స్‌ సబ్జెక్టు పట్టభద్రురాలైంది. ఆమె విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆమె తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ, సివిల్ సర్వీస్ మార్గం ఆమెను ఎప్పుడూ ఆకర్షించలేదు.ముఖ్యంగా ఆమె “అలిఫ్”, “నక్కష్” వంటి చిత్రాలలో చెప్పుకోదగ్గ పాత్రలు చేస్తూ సినిమా ప్రపంచంలోకి ప్రవేశించింది. “అలీఫ్”లో షమ్మీ పాత్ర పోషించినందుకు ఆమె ప్రశంసలు అందుకుంది. అలాగే “నక్కష్”లో ఆమె పాత్రికేయురాలు పాత్ర పరిశ్రమలో ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె మాస్టర్స్‌ డిగ్రీను పొందింది. 

తన మాస్టర్స్ డిగ్రీ తరువాత మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీ పీఎస్‌సీ) పరీక్షలో సిల్లా తన నైపుణ్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది. కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఆమె రాష్ట్ర సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా డీఎస్పీగా ఎంపికైంది. ముఖ్యంగా ఆమె కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆశ్రయించకుండా ఆమె స్వయంగా చదువుకుని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అయ్యింది. ఆమె ఎలాంటి కోచింగ్ సహాయం లేకుండానే యూపీఎస్సీ సీఎస్‌ఈలో సిమ్లా తన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (ఐపీఎస్‌)లో పనిచేయడానికి ఎంపికైన ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఎస్పీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.