Acharya Nagarjuna University: కరోనా కారణంగా ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు కాగా మరికొన్ని పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో బోర్డులు తిరిగి పరీక్షలను నిర్వహించే పనిలో పడ్డాయి. అయితే కరోనా సమయంలో పరీక్షా ఫీజులను సకాలంలో చెల్లించని వారిని దృష్టిలో పెట్టుకొని పరీక్ష ఫీజుల చెల్లింపుల గడువును పెంచుతూ ఇప్పటికే పలు యూనివర్సిటీలు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన డిగ్రీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తాజాగా అదనపు పరీక్షల నిర్వహణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. సవరించిన షెడ్యూల్‌ను వర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేయాలని గత కొన్ని రోజులుగా పలు విద్యార్థి సంఘాలు వినతిపత్రాలు ఇస్తోన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించనున్నారు. మారిన పరీక్షల తేదీలు, ఫీజు చెల్లింపునకు గడువు ఇలా ఉన్నాయి..
* ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు 28-07-2021 వరకు ఫీజులు చెల్లించుకోవచ్చు.
* 4, 6 సెమిస్టర్లు, వన్‌టైం ఆపర్చ్యునిటీ ప్రాక్టికల్ పరీక్షలను 03-08-2021 నుంచి 10-08-2021 వరకు నిర్వహించనున్నారు.
* 4, 6 సెమిస్టర్లు, వన్‌టైం ఆపర్చ్యునిటీ థియరీ పరీక్షలను 12-08-2021న నిర్వహించనున్నారు.
Also Read: TV9 దృశ్యం :నడిరోడ్డు పై భారీ త్రాచుపాముల సయ్యాట..గగుర్పొడిచే వీడియో..:Two Snakes Dance Video.
OTT: ఒటీటీ సూపర్‌హిట్.. 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న మార్కెట్..మరింత వేగంగా విస్తరణ!