CBSE: విడుదల కానున్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్‌ టైమ్‌ టేబుల్‌.. పరీక్షలు ఎప్పుడంటే.

|

Dec 08, 2022 | 12:25 PM

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి చదువుతోన్న విద్యార్థులు బోర్డ్‌ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలపై ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ నెలలో అప్పుడే 8 రోజులు పూర్తయ్యాయి. మరో నెలలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో బోర్డ్‌ ఎగ్జామ్‌కు ప్రిపరేషన్‌ కూడా ప్రారంభించారు...

CBSE: విడుదల కానున్న సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్‌ టైమ్‌ టేబుల్‌.. పరీక్షలు ఎప్పుడంటే.
Cbse Exmas
Follow us on

సీబీఎస్‌ఈ  10, 12వ తరగతి చదువుతోన్న విద్యార్థులు బోర్డ్‌ పరీక్షల టైమ్‌ టేబుల్ విడుదలపై ఎదురు చూస్తున్నారు. డిసెంబర్‌ నెలలో అప్పుడే 8 రోజులు పూర్తయ్యాయి. మరో నెలలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో సీబీఎస్ఈ  బోర్డ్‌ ఎగ్జామ్‌కు ప్రిపరేషన్‌ కూడా ప్రారంభించారు. దీంతో టైమ్‌ టేబుల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్‌ టైమ్‌ టేబుల్‌ను డిసెంబర్‌ 9వ తేదీన (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

పరీక్ష షెడ్యూన్‌ను విడుదల చేసిన వెంటనే విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ www.cbse.gov.in, www.cbse.nic.inలో చూసుకోవచ్చు. సీబీఎస్‌ఈ ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షలను ఒకేసారి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ఎగ్జామ్‌ టైమ్‌ టేబుల్‌ను విడుదల చేసిన తీరును గమనిస్తే పరీక్షల కంటే నెలన్నర నుంచి రెండు నెలల ముందు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.

ఇదిలా ఉంటే అడ్మిట్‌ కార్డులో ఎంటర్‌ చేసే వివరాలపై సీబీఎస్‌ఈ ఇటీవలే ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 6వ తేదీ తర్వాత పేరుతో పాటు ఇతర వివరాల్లో ఎలాంటి కరెక్షన్స్‌ చేయడానికి వీలు లేదని అధికారులు తెలిపారు. అందులోనూ పూర్తి పేరును మార్చడానికి వీలు లేదని కేవలం చిన్న చిన్న తప్పులను మాత్రమే సరిదిద్దుకునే వెలుసుబాటు ఉందని సీబీఎస్‌ఈ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..